సంక్షేమం..అభివృద్ధి..జగనన్నకే సాధ్యం..
1 min readకర్నూలు పార్లమెంట్ లోక్ సభ అభ్యర్థి బివై రామయ్య
- కర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్రంలో సంక్షేమం.. అభివృద్ధి … జగనన్నకే సాధ్యమన్నారు కర్నూలు పార్లమెంట్ లోక్ సభ అభ్యర్థి బివై రామయ్య. బుధవారం నగరంలోని 24వ వార్డు మద్దూర్ నగర్లో రామయ్యతోపాటు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్ బాష పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సంక్షేమాన్ని ప్రవేశపెట్టే సత్తా అన్ని కొనసాగించే శక్తి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే ఉందని, ప్రతిపక్షాలు అన్ని ఏకమైన వైస్సార్సీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని అన్నారు. అక్కడి ప్రజలు ఎస్ వి మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మద్దూర్ నగర్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలియజేశారు. ఎస్.వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూల్ నగరము ప్రజల స్పందన చూస్తుంటే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ మెజార్టీ తో గెలవడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు ఎస్ వి యూత్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.