టీడీపీతోనే.. అభివృద్ధి సాధ్యం..
1 min readవైసీపీకి ఓటు వేస్తే నోటా ఓటు వేసినట్టు..
నంద్యాల టిడిపి పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి..
గడివేముల, పల్లెవెలుగు:స్థానికంగా పరిశ్రమలు ఉన్న యువతకు ఉపాధి ఏది.. ఉద్యోగాలలో కూడా ఎమ్మెల్యే చేతివాటం నవరత్నాలతో ప్రజలకు ఉపయోగం లేదు. సంపద ఉద్యోగం సృష్టించిన నాయకులే చరిత్రలో నిలిచిపోతారు అధికారంలోకి వస్తే పరిశ్రమలలో స్థానికులకు ఉపాధిలో ప్రాధాన్య ఇస్తామన్నారు. గడివేముల మండల పరిధిలోని బిలకల గూడూర్ గ్రామంలో టిడిపి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి. పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు .రానున్న ఎన్నికల్లో టిడిపి పార్టీ రాష్ట్రంలో ప్రభజన సృష్టిస్తుందని ఈ ఐదు సంవత్సరాలలో వైసిపి పాలనతో ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని ఇసుక మద్యం కరెంట్ చార్జీలు పెంచి ప్రజల మడ్డి విరిచారని పరదాల చాటు సీఎం ప్రజలకు ఏం మేలు చేస్తాడని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మోసపోవద్దని కోరారు గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రతి పనికి కమిషన్ తీసుకుంటాడని ఇక అభివృద్ధి అతనికి ఏమి పట్టదని మళ్లీ ఐదు సంవత్సరాలు అధికారంలోకి వస్తే ప్రజలను తాకట్టు పెడతారని ఆదాయం తప్పితే ప్రజల బాగోగులు పట్టవని ముస్లింలకు టిడిపి ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని ముస్లిం మైనారిటీలకు సబ్సిడీ రుణాలను ఇవ్వడం మసీదు ఈద్గాల మరమ్మతుల కోసం మౌజనులు ఇమామ్లకు గౌరవ వేతనం ఇచ్చిన ఘనత టిడిపిదే అని అన్నారు అలాగే రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం పేదలకు రంజాన్ తోఫా ఇచ్చిన ఘనత కూడా టిడిపి దేనని వచ్చే ఎన్నికలలో పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి .తనకు ఓటు వేసి టిడిపికి సైకిల్ గుర్తుకు గెలిపించాలన్నారు నారా చంద్రబాబునాయుడుని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుందని అమరావతిని అభివృద్ధి చేసుకొని మన రాజధానిగా ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు .. ఈ కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి. మాజీ ఎంపీపీ వంగాలా శ్రీనివాస్ రెడ్డి. పంట రామచంద్రారెడ్డి.. బిడుదురి సీతారాం రెడ్డి. ఎస్ ఎ రఫిక్. ఎస్ ఏ ఖలిద్. జయంత్ రెడ్డి. ఎస్ ఏ ఫరూక్. సుదర్శన్ రెడ్డి. దుర్వేసి కృష్ణ యాదవ్. టిడిపి జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ. . బీజేపీ నాయకురాలు షబానా. బత్తుల సుభద్రమ్మ. వడ్డు లక్ష్మీదేవి. మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.