రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు తోనే సాధ్యం…
1 min readబాబు ష్యూరిటి – భవిష్యత్తుకు గ్యారంటీ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని, ఓబులంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు యూనిట్ ఇంచార్జ్ ముండ్ల శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలోఆదివారం బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించటం జరిగినది,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమం రెండింటిలో ముందుకు వెళ్లాలంటే ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు , మినిమ్యానిపోస్ట్ ద్వారా సూపర్ 6 పథకాలనుప్రకటించడం జరిగిందని రాష్ట్ర అభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సాధ్యమని టీడీపీ నాయకులు ముండ్ల శ్రీనివాసులురెడ్డి తెలిపారు,ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కుటుంబాలు అభివృద్ధి పథంలో ముందగుడు వెయ్యటానికి ఆ పథకాలను ప్రతీకుటుంబంతెలియజేయడం,జరుగుతున్న దని ఆయన తెలిపారు,తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిది, తల్లికి వందనం, ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం, అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల రూపాయల ఆర్థిక సాయం, యువగళం నిధి ద్వారా నెలకు 3000 రూపాయలు ఆర్థిక సాయం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు పేదలను సంపన్నులు చేయటమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆయన అన్నారు, ,చంద్ర బాబు నాయుడు తోనే మన రాష్ట్రంలో అధివృధి, సంక్షేమం రెండూ అమలు అవుతాయని ఆయన తెలిపారు,, కకాబట్టీ మనం అందరం కలిసి, రాబోయే 150 రోజులు పార్టీ కోసం కష్టపడి చంద్ర బాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనవుందని ఆయన తెలిపారు, ఈవిషయాలను ప్రజలకు చేరవేసేందుకే కార్యక్రమ ముఖ్యఉదేశ్యమని ఆయన అన్నారు, కార్యక్రమంలో సానప రెడ్డి రఘునాథ్ రెడ్డి, ముండ్ల లక్ష్మిరెడ్డి, ఎల్లాల నాగరాజు, ఐ టీడీపీ ఛాంపియన్ యామల మణికంఠ , బుక్కన తిలక్, సోమ సంజీవయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.