రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది…:గౌరు చరితారెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్. గడివేముల: రాష్ట్రంలో వైకాపా పాలన మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని పాణ్యం మాజీ శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి అన్నారు. ఆదివారం గడివేముల మండలంలోని కే బొల్లవరం, దుర్వేశి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నంద్యాల టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గౌరవ సభ నిర్వహించారు. దుర్వేసి గ్రామానికి చేరుకునే ముందు తిరుపాడు గ్రామం నుంచి దుర్వేసి గ్రామం వరకు ఐ టి డి పి కార్యకర్తలు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.దుర్వేశీ గ్రామానికి చేరుకోగానే పెద్దఎత్తున కార్యకర్తలు,నాయకులు గౌరు వెంకటరెడ్డి,గౌరు చరితారెడ్డి లకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గౌరు దంపతులు మాట్లాడుతూ, మద్య నిషేధం వేస్తానని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతోనే పథకాలకు డబ్బు ఇస్తున్నానని చెప్పడం ఆయన పాలసీ ఏమిటో అర్థమవుతుందన్నారు.రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనపడుటలేదని, కేవలం ప్రకటనల వరకే అది ఉందన్నారు.ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కార్యక్రమమైనా చేసిందా అని ప్రశ్నించారు. జగనన్న కాలనీలకు కోట్లు వెచ్చిస్తున్నామంటూ ప్రకటనల చేస్తున్నారే కానీ, ఎక్కడ కూడా ఆ కాలనీలు కనపడుట లేదన్నారు. నవరత్నాల పేరుతో అధికారంలోకి ప్రజలను మోసం చేశారని ఆదాయ మార్గాలను మూసివేసి అప్పుల మార్గాలను తెరిచారని ఆరోపించారు వచ్చే ఎన్నికలలో టిడిపి నీ గెలిపించుకోలేక పోతే అభివృద్ధి కలగా మిగిలిపోతుందని నారా చంద్రబాబు నాయుడు నీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు దుర్వేసి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు అంగజాల కృష్ణ యాదవ్ అంగజాల శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో గౌరవ సభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ మంచాలకట్ట శ్రీనివాస రెడ్డి ,మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి, పాణ్యం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్,బిసి సెల్ ప్రధాన కార్యదర్శి కెతురు మధు, సుభద్రమ్మ , వొడ్డు లక్ష్మి దేవి,బుజనురు రామచంద్ర రెడ్డి,సిద్ధం శ్రీను, బిలకలగూడూరు రఫిక్ భాష ,మండల నాయకులు,గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.