అభివృద్ధి తెదేపా తోనే సాధ్యం:మాండ్ర
1 min read
ముఖద్వారం..ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభం
నందికొట్కూరు, న్యూస్ నేడు: అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం హౌసింగ్ బోర్డ్ 26 వ వార్డులో నూతనంగా నిర్మించినకాలనీ ఆర్చ్ (హౌసింగ్ బోర్డ్ కాలనీ ముఖద్వారం)మరియు ట్రాన్స్ ఫార్మర్ ను గురువారం ఉదయం 11 గంటలకు మాండ్ర శివానందరెడ్డి మరియు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,వార్డ్ కౌన్సిలర్ మందడి వాణి ప్రత్యేకంగా పూజలు చేసి టెంకాయలు కొట్టిన అనంతరం శిలా ఫలకాలను రిబ్బన్ కట్ చేసి వాటిని ప్రారంభించారు.గత ఐదేళ్లలో చేయలేని అభివృద్ధి పది నెలల్లోనే అభివృద్ధి అంటే ఏదో చేసి పట్టణం మరియు పల్లెల్లో చూపిస్తున్నామని అంతే కాకుండా పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని శివానందరెడ్డి అన్నారు.ముందుగా శివానందరెడ్డికి నాయకులు పూల బోకేలతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్,భాస్కర్ రెడ్డి,అశోక్,ధర్మారెడ్డి, శ్రీనివాసులు,నాయకులు ప్రసాద రెడ్డి,రవీంద్రా రెడ్డి, కృష్ణారెడ్డి,మల్లికార్జున రెడ్డి, లాయర్ జాకీర్,జమీల్,రజనీ కుమార్ రెడ్డి, రమేష్,అబ్దుల్లా,బ్రహ్మయ్య పాల్గొన్నారు.