PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసమర్ధత పాలకుల వల్ల అభివృద్ధి శూన్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం లో అభివృద్ధి వెనకబడిపోయిందని సంవత్సరాల తరబడి పోరాటం చేస్తూ ఎత్తిపోతల పథకాలు నిర్మించండి అని ప్రజలు కోరుతున్న  పాలకులు పట్టించుకోకుండా సమయం వృధా చేస్తూ రాజకీయాలు చేస్తు కాలయాపన చేసారని, అసమర్ధత పాలకుల వల్ల నియోజకవర్గ అభివృద్ధి శున్యమని సిపిఐ జిల్లా నాయకులు ఎం.రమేష్ బాబు అన్నారు.గురువారం స్థానిక సీపీఐ కార్యాలయం లో వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గం లో అట్టడుగు వర్గాల రైతులు అధిక శాతం ఉన్నారని వారు వేల ఎకరాల్లో మెట్ట భూములు సాగు చేస్తున్నారని సాగునీరు లేక విలవిలలాడుతూ పోరాటాలే మార్గంగా ఎంచుకొని ధర్నాలు చేస్తున్న కూడా పాలకులు స్పందించడంలో విఫలం చెందారన్నారు. జూపాడు బంగ్లా మిడుతూరు మండలాల్లో రైతులు హక్కుగా రావలసిన కృష్ణాజలాల కై పోరాటాలు చేస్తున్నారన్నారు.. అలగనూరు రిజర్వాయర్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే పాలక ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని  శాశ్వత పరిష్కారంగా ఒక ఎత్తిపోతల పథకమైన నియోజకవర్గంలో నిర్మించారా అని వారు ప్రశ్నించారు. మండ్లెం గ్రామ రైతులు చేసిన దీక్ష పాలకులకు కనపడలేదా అని వారు అన్నారు. ఇక్కడున్న నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఈ ప్రాంత పాలకులు తహతహ లాడుతున్నారని ఓట్లు వేసిన రైతులను పట్టించుకోవడంలో విఫలం చెందారన్నారు.  తక్షణమే ఈ ప్రాంతంలో అభివృద్ధికై పోరాటానికి సీపీఐ గా సిద్ధపడతామన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఐ నాయకులు వాహిదూదిన్,నరసింహ,, మధు తదితరులు పాల్గొన్నారు.

About Author