టిడిపి గెలిస్తేనే కర్నూలు అభివృద్ధి … టి.జి. భరత్
1 min readఏ వీధికి వెళ్లినా ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు
తాను గెలవని కారణంగానే రెండు పరిశ్రమలు ఇక్కడకు రాలేదు
గెలిచిన వెంటనే కర్నూలుకు పరిశ్రమలు తెస్తా
నగరమా మేలుకో కార్యక్రమంలో పాల్గొన్న టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే కర్నూలు అభివృద్ధి చెందుతుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 50వ వార్డు కొత్తపేటలో టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన నగరమా మేలుకో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకొని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలు అందించారు. టిడిపి మినీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలను వివరించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ఏ వీధికి వెళ్లినా ప్రజలు త్రాగునీటి సమస్యతో పాటు, విద్యుత్ షార్ట్ సర్య్కూట్, వేలాడుతున్న విద్యుత్ తీగలు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు చెబుతూనే ఉన్నారన్నారు. అర్దరాత్రి 1 గంట సమయంలో కుళాయిలకు నీరు వదిలి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తన తండ్రి టి.జి వెంకటేష్ హయాంలో మున్సిపల్ వాటర్ ప్రజలకు అనుకూలమైన సమయంలో వదిలేవారన్నారు. అందుకే సరైన నాయకుడు ఉంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడని టి.జి భరత్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యే చేయాలని ప్రజలు కోరుతున్నానన్నారు. తాను గెలిచి, టిడిపి అధికారంలోకి వస్తే కర్నూలును అభివ్రుద్దిలో ముందుకు తీసుకెళతామన్నారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చే కెపాసిటీ తన దగ్గర ఉందని టి.జి భరత్ భరోసా వ్యక్తం చేశారు. తాను గెలవని కారణంగానే ఇక్కడకు రావాల్సిన రెండు కంపెనీలు వెనక్కు వెళ్లిపోయినట్లు తెలిపారు. అందుకే ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని భరత్ చెప్పారు. స్థానికంగా పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతంలోని వారంతా బాగుపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు వార్డు ఇంచార్జి మణి, బూత్ ఇంచార్జీలు, దశరత్, రంగారెడ్డి, చెన్నప్ప, ఉదయ్, గౌతమి, శిరీష, భరత్, కర్ణ, వెంకటేశ్వరరావు, రిజ్వానా, సానియా, టిడిపి నేతలు పోతురాజ్ రవి, మన్సూర్ ఆలీఖాన్, మాజీ కార్పోరేటర్లు, అబ్బాస్, రామాంజనేయులు, గున్నామార్క్, తిమ్మోజీ, టి.ఎన్.టి.యు.సి నేతలు నరసింహులు, పాల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.