స్థానిక సంస్థల అభివృద్ధే .. దేశాభివృద్ధి
1 min readపంచవర్ష ప్రణాళికతో అభివృద్ధి… అందులో కేంద్రం నిధులే ఎక్కువ
– ఎన్ఆర్ఈజీఎస్లో 20 రకాల పనులకు.. వెచ్చించేది.. కేంద్రానివే..
– రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలపై అప్పుల భారం మోపుతోంది
– పోలీసులను వాడుకొని.. ఏకగ్రీవం చేసుకుంటోంది..
– జగన్ పాలనను.. ప్రజలు గమనిస్తున్నారు
– విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు
పల్లెవెలుగు, కర్నూలు
స్థానిక సంస్థల అభివృద్ధే.. దేశాభివృద్ధి అని… అటువంటి సంస్థలను పట్టించుకోకుండా… ఒక అజెండా అనేదే.. లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు విమర్శించారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంటూ చెప్పుకొస్తున్న జగన్ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజలపై భారం మోపుతోందన్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు పొలంకి రామస్వామి అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో సోమువీర్రాజుతోపాటు ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి , మాజీ మంత్రి బిజెపి జిల్లా ఇన్ చార్జ్ రావెల కిషోర్ బాబు, ఉపాధ్యక్షులు చంద్రమౌళి , రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వినూషా రెడ్డి, రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ పార్థసారథి వాల్మీకి , బిజెవైఎమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మీసాల ప్రేమ్ కుమార్, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శులు కాళింగి నరసింహ వర్మ , కాశీ విశ్వనాథ్ , ఓబిసి మోర్చా నాయకులు మురళీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమేమిటని ఘాటుగా ప్రశ్నించారు. అప్పులు చేసి.. పథకాలు వర్తింపజేసి.. రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టడం అవసరమా అని పేర్కొన్నారు. పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులను వాడుకొని.. గ్రామపంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. పులివెందులలో ఏకగ్రీవాలకు కారణం.. బెదిరింపులేనన్నారు.
పెట్రోల్.. జీఎస్టీ పరిధిలోకి..
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటం వల్ల… రవాణాచార్జి పెరిగి .. నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వాస్తవమేనని, ఇది ప్రజలపై భారం పడుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు. పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడంలేదన్నారు.