సంక్షేమ పథకాలతోనే పేదల అభ్యున్నతి
1 min read– ఎన్నికల హామీలును నెరవేర్చడంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం జగన్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఫిబ్రవర సంక్షేమ పథకాలుతోనే పేదల అభివృద్ధి జరుగుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు. నందికొట్కూరు పట్టణంలోని సచివాలయ 4 పరిధిలో మంగళవారం గాంధీ నగర్, పగిడ్యాల బైపాస్ రోడ్డు, కాలనీలో నిర్వహించిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పాల్గొన్నారు . ప్రతి ఇంటి గడపకు ఎమ్మెల్యే ఆర్థర్ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ, సమస్యలుపై ఆరా తీస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలనడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందడంలేదని దృష్టికి తీసుకొచ్చినవారి ఎదుటే అధికారుల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు.వీధులలో నెలకొన్న సనస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన సాగుతోందన్నారు.సమస్యల పరిష్కారానికే గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన సాగుతోందన్నారు.ఎన్నికలలోనూ, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దేశంలోనే ఆదర్శంగా సీఎం జగన్ నిలుస్తారన్నారు.
నవరత్నాల పథకాలతో గడప గడపనా సంతృప్తి..
గాంధీనగర్ సచివాలయ పరిధిలోని కాలనీ వాసులకు అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత, తదితర పథకాలు సుమారుగా అన్ని ఇళ్లకు అందాయి.సుమారుగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు లబ్ది అందడం పై ప్రజలు సంతోషం వ్యక్తం చేసి, సీఎం జగన్, ఎమ్మెల్యే ఆర్థర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ శుకూర్ , నందికొట్కూరు మునిసిపల్ వైస్ చైర్మన్ మొల్లా రబ్బానీ , కౌన్సిలర్లు ఉండవల్లి ధర్మారెడ్డి ,జాకీర్ హుస్సేన్ , నందికొట్కూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సగినేల. ఉసేనయ్య , పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , జిల్లా SC & ST మానిటరింగ్ కమిటీ సభ్యులు సంటిగారి. దిలీప్ రాజ్ , బ్రాహ్మణకొట్కూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ మద్దూరు. హరి సర్వోత్తమ్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ పి. కిషోర్ , మండల డిప్యూటీ తహసిల్దార్ పద్మావతి , వైసిపి నాయకులు ముజీబ్,అయ్యన్న,భాస్కర్, యోసేపు, కడుమూరు గోవర్ధన్ రెడ్డి, తలముడిపి అశోక్ రెడ్డి, పైపాలెం ఇనాయతుల్లా, పాములపాడు చౌడయ్య, ముడియాల వెంకటరమణారెడ్డి, అంబన్న, శివలింగం, కలబండి అంకన్న, కదిరి సుబ్బన్న, వలిభాష,గోల, వైసీపీ నాయకులు కార్యకర్తలు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.