సంక్షేమ పథకాలతోనే పేదల అభ్యున్నతి..
1 min read– ప్రజల సుఖ సంతోషాలే ద్వేయంగా జగనన్న పాలన..
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: సంక్షేమ పథకాలు తోనే పేదల అభ్యున్నతి సాధ్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.బుధవారం మండలంలోని కొణిదేల గ్రామంలో సర్పంచి కొంగర నవీన్ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆర్థర్ ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా? లేదా? అని అగిడి తెలుకొని వారికి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ, అలాగే గ్రామంలోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆర్థర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. ప్రతి పక్ష పార్టీల వారి లాగా జన్మభూమి కమిటీ లను పెట్టి వారికీ అనుకూలమైన వారికి మాత్రమే ముఖాలు చూసి ఫించన్, ఇతర ప్రభుత్వ నుండి వచ్చే లబ్దిని ఇచ్చే పద్ధతులు ఇప్పుడు లేవని, జన్మభూమి కమిటీల పేరుతో అన్యాయంగా ప్రజల సొమ్మును తెలుగుదేశం పార్టీ నాయకులకే దోచిపెట్టారని ఆరోపించారు. అలాగే, గతంలో ప్రజా ప్రతినిధులు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇళ్ళ ముందుకు వచ్చేవారు , కానీ ఇప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవటం కోసం ప్రజాప్రతినిధులు ప్రతి గడపకు వెలుతున్నామని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అని తెలుకోడమేమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటే, ఈ ప్రతిపక్ష నేతలు ప్రజలకు మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేక ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ప్రభుత్వం లో మీరు అందించిన సంక్షేమ పథకాలు ఏంటో చెప్పమని అడిగితే ఆ ప్రశ్న కు సమాధానం లేదని అన్నారు. ఈ సచివాలయం పరిధిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతీ గ్రామానికి కోట్ల రూపాయలు ప్రజల అభ్యున్నతికి, మరియు గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసారని తెలిపారు. అదేవిధంగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో శాసనసభ్యులు దృష్టికి వచ్చిన సమస్యలని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖా అధికారులని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొణిదెల , రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి , నందికొట్కూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సగినేల ఉసేనయ్య, డైరెక్టర్ వంగాల సుబ్బారెడ్డి , సింగిల్ విండ్ మాజీ చైర్మన్ చందమాల బాలస్వామి , ఆలయ కమిటీ చైర్మన్ కిరణ్ కుమార్ ,వైసీపీ నాయకులు పగిడ్యాల ఉదయ్ కిరణ్ రెడ్డి, బ్రాహ్మణ కొట్కూరు రాఘవేంద్ర రెడ్డి, ఉదయ్ కిరణ్ రెడ్డి, కడుమూరు గోవర్ధన్ రెడ్డి, పాములపాడు రమణారెడ్డి, బిజినవేముల మహేష్, డాక్టర్ మహమ్మద్ రఫీ, రఫీక్ అహమ్మద్,మండల తహసిల్దార్ రాజశేఖర్ బాబు , మండల అభివృద్ధి అధికారి శోభా రాణి ,ఈఓ ఆర్డీ సుబ్రహ్మణ్యం శర్మ , మండల వ్యవసాయ అధికారి శ్రావణి, పంచాయతీ రాజ్ ఏఈ ప్రతాప్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ రాము నాయక్, మండల విద్యాధికారి ఫైజున్నిసా బేగం, పశు వైద్యాధికారి నవీన్ కుమార్ రెడ్డి ,వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.