రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం..
1 min read– సాగునీటి ప్రాజెక్టుల సందర్శన విజయవంతం.
– విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
– టీడీపీ నాయకుడు మాండ్ర శివానంద రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమవుతుందని , తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.1.22 లక్షలు ఆర్థికసాయం అందుతుందని టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డిస్పష్టం చేశారు. బుధవారం నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి కార్యక్రమం విజయవంతం కావడంతో నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లలో జగన్ సర్కార్ ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచారని, వాటితోపాటు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారని, ఏటా ఇంటి పన్నులు పెంచడంతోపాటు చెత్తపై పన్ను విధించిన చెత్త సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో సామాన్యులు సంతోషంగా బతికే పరిస్థితి లేదన్నారు. దౌర్జన్య పాలన సాగిస్తున్న నేతలను ప్రశ్నిస్తే కేసులుపెట్టడం, భయపెట్టడంపరిపాటిగా మారిందన్నారు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన ఉంటుందని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టోను వివరించడంతోపాటు వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఎన్నికలలో హామీలు నెరవేర్చకుండా జగన్ ప్రజలను, యువతను, రైతులనుమోసం చేశారన్నారు. ఇలాంటి సైకో పాలనకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే వస్తున్నాయన్నారు. మేనిఫెస్టో ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.1.22 లక్షలు ఆర్థికసాయం అందుతుందని అంతేకాదు అదనంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలుగుతుందని చెప్పారు.రాష్ట్ర సంపద పెంచాలన్న, పేదలకు పంచాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ అసమర్ధత, సీఎం బాధ్యతారాహిత్యం వల్లే అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయసూర్య, టీడీపీ నాయకులు పలుచాని మహేష్ రెడ్డి, మోహన్ రెడ్డి, గిరీష్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహమ్మద్, టీడీపీ కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.