పర్యాటక రంగ అభివృద్ధే.. ప్రభుత్వ లక్ష్యం
1 min readఇంచార్జి పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ అధికారిణి పి. విజయ
పల్లెవెలుగు వెబ్:రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు కర్నూలు జిల్లా ఇన్చార్జ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ అధికారిణి పి. విజయ. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నగరంలోని కేవీఆర్ కళాశాలల ఆవరణలో పర్యాటక శాఖపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతకు ముందు పర్యాటక శాఖ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా శాంతి, సెట్కూరు సీఈఓ రమణ, ఫ్రీడమ్ ఫైటర్స్ శ్రీ సర్దార్ నాగప్ప గారి కుమారుడు బుచ్చిబుబు, నారాయణ రావు కుమారుడు చంద్రశేఖర్, లయన్స్ క్లబ్ రిప్రెంసెంటేటివ్ రాయపాటి శ్రీనివాస్, సెట్కూరు మేనేజర్ సత్యనారాయణ, టూరిజం మేనేజర్ వెంకటేశ్వర్లు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి. విజయ మాట్లాడుతూ పర్యాటక రంగంలో సాంస్కృతిక విభాగం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలు, ప్రాజెక్టులు తదితర విశిష్ట ప్రదేశాలను పర్యాటకుల సందర్శనార్థం ఏర్పాటు చేశారన్నారు. పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖలో పలు అభివృద్ధి పథకాలు తీసుకుంటోందన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలను సత్కరించి బహుమతులు, సర్టిఫికెట్స్ అందజేశారు.