PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపితోనే మ‌హిళ‌ల‌కు సంక్షేమం అభివృద్ధి..

1 min read

క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

తెలుగుదేశం పార్టీలో చేరిన 22వ వార్డు మ‌హిళ‌లు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మహిళలకు సంక్షేమం, అభివృద్ధి ఉంటాయని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. గురువారం న‌గ‌రంలోని 22వ వార్డు అరోరా న‌గ‌ర్‌కు చెందిన మ‌హిళ‌లు మౌర్య ఇన్‌లో టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి కావాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌న్నారు. రోజురోజుకూ తెలుగుదేశం పార్టీకి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని తెలిపారు. టిడిపి అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌కు ఎంతో ల‌బ్ది చేకూరుతుంద‌న్నారు. స్త్రీల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణంతో పాటు, ఆడ‌బిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్ర‌తి స్త్రీకి నెల‌కు రూ. 1500 అందించడంతో పాటు ఎన్నో మంచి ప‌థ‌కాలు టిడిపి మేనిఫెస్టోలో పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. క‌ర్నూల్లో త‌న‌ను గెలిపిస్తే ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువ‌త‌కు అండ‌గా ఉండి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. క‌ర్నూల్లోని అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని టి.జి భ‌ర‌త్ అన్నారు. పార్టీలో చేరిన వారిలో భ‌వానీ, శార‌ద‌, సుధ, ల‌క్ష్మీదేవి, ఎంజెలి, ఇందిర‌, మ‌ధుల‌త‌, కావేరి, సుబ్బ‌మ్మ‌, త‌దిత‌రులు ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వార్డు టిడిపి నేత‌లు శ్రీధ‌ర్‌, విష్ణు, వంశీ, వ‌నిత‌, దీపిక‌, చైత‌న్య పాల్గొన్నారు.

About Author