టిడిపి హయాంలోనే అభివృద్ధి
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: టిడిపి హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మహానంది మండలంలో బుధవారం ఆయన మహానంది సమీపంలోని పాలేరు వాగు వంతెన నిర్మాణం మహానంది వ్యవసాయ కళాశాల రోడ్డు తదితర వాటిని పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు మహానంది బోయిలకుంట్ల రోడ్డు నిర్మాణ కోసం తెలుగుదేశం ప్రభుత్వం 13 కోట్ల రూపాయల ఖర్చు చేసిందని కానీ ప్రభుత్వాలు మారడంతో వ్యవసాయ కళాశాల నుండి మహానంది వరకు దాదాపు 3 కిలోమీటర్లు మధ్యలో ఆగిపోయాయని వాటికి సంబంధించి గుంతల రోడ్లకు ఎలాంటి పరమతులు లేదా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం విడ్డూరమన్నారు. మహానంది బోయిలకుంట్ల రహదారిలోని మహానంది సమీపంలో పాలేరు వాగు వంతెనపై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కూడా వైయస్సార్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మండలంలోని గాజులపల్లె షాదికాన నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో బీజం పడిన నేటికి కూడా దానికి నిధులు కేటాయించి పూర్తి చేయకపోవడం విడ్డూరమన్నారు. ఎదురు ప్రశ్నిస్తే కేసులు బనాయించడం తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమానికి ముందు మహానంది క్షేత్రంలో స్వామి అమ్మవాళ్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు స్థానిక ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి మాత్రం స్వాగత కార్యక్రమాల్లో పాల్గొన్న లేదని టిడిపి వర్గాల ఆరోపిస్తున్నాయి. వైసిపి క్రింది స్థాయి కార్యకర్తలు వచ్చినా దేవస్థాన ఈవో స్వాగతం పలికే వారిని కానీ మాజీ ఎమ్మెల్యే వస్తున్నా చలనం లేదని విమర్శించారు. కొన్ని అనివార్య కారణాలతో రాలేదని విచారణలో భాగంగా కోర్టు కేసులకు సంబంధించి బిజీగా ఉన్నందున రాలేకపోయినట్లు మీడియాకు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బాధ్యుడు బన్నూరు రామలింగారెడ్డి తమ్మడపల్లె జనార్దన్ రెడ్డి మహానంది మాజీ దేవస్థానం చైర్మన్ పాణ్యం ప్రసాదరావు గాజులపల్లి ఆర్ఎస్ శీను మరియు మండలంలోని ఇతర గ్రామాలకు చెందిన టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు .