అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
1 min read
నగరపాలక కమిషనర్ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం నగరంలో వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, 5వ శానిటేషన్ డివిజన్ కార్యాలయం, గడియారం ఆసుపత్రి, పాత తుంగభద్ర పంప్ హౌస్, వాహనాల మరమ్మత్తుల షెడ్, గార్గేయపురం డంప్ యార్డులో బయోమైనింగ్, శునకాల సంతాన నియంత్రణ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయా పనులను ఏయే దశలో ఉన్నాయని, వాటి పురోగతిపై ఆరా తీశారు. పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు త్వరితగతిన తీసుకోవాలని, అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని సూచించారు. పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గడియారం ఆసుపత్రి ఆధునికీకరణ పనులు, బయో మైనింగ్, శునకాల సంతాన నియంత్రణ ఆపరేషన్లు మరింత వేగవంతం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.