NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధి పనులు వేగ‌వంతం అవ్వాలి.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

1 min read

కాంట్రాక్టర్లు స‌కాలంలో ప‌నులు పూర్తిచేయాలి

నాణ్యత ప్రమాణాల్లో రాజీప‌డేది లేదు

మున్సిప‌ల్ కౌన్సిల్ హాల్లో అధికారులు, కాంట్రాక్టర్లతో స‌మావేశం నిర్వహించిన మంత్రి టి.జి భ‌ర‌త్

కర్నూలు, న్యూస్​ నేడు:  క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో అభివృద్ధి ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని అధికారులు, కాంట్రాక్టర్లను రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ ఆదేశించారు. న‌గ‌రంలోని మున్సిప‌ల్ కౌన్సిల్ హాల్‌లో మున్సిప‌ల్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయ‌న స‌మావేశం నిర్వహించారు. న‌గ‌రంలోని వివిధ వార్డుల్లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై ఆయ‌న‌ చ‌ర్చించారు. ఏ కాంట్రాక్టర్ ఏఏ ప‌నులు చేప‌ట్టారు, ప‌నుల పురోగ‌తి ఏంట‌ని ఆరా తీశారు. ఇంకా మొద‌లు పెట్టని ప‌నుల విష‌యంలో స‌మాధానం చెప్పాల‌న్నారు. ఇప్పటికే ప‌నులు ప్రారంభించి పూర్తికాని వాటి గురించి చ‌ర్చించారు. ఎప్పటిలోగా ప‌నులు పూర్తి చేస్తారో అడిగి వివ‌రాలు నోట్ చేసుకున్నారు.త‌క్కువ ధ‌ర‌కు ప‌నులు ద‌క్కించుకుంటే నాణ్య‌త‌తో ఎలా చేస్తార‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ ప్రశ్నించారు. త‌మ ప్రభుత్వం జ‌వాబుదారీత‌నంతో ప‌నిచేస్తోంద‌ని, ప్రజ‌ల‌కు మంచి పాల‌న అందించేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. వార్డుల్లో చేప‌ట్టే అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త విష‌యంలో రాజీప‌డే ఉద్దేశం లేద‌న్నారు. త‌మ‌కు చెడ్డపేరు తీసుకొచ్చేలా ప‌నిచేస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని ఆయ‌న హెచ్చరించారు. ప‌నులు ప్రారంభించిన త‌ర్వాత నిర్ణీత గ‌డువులోగా పూర్తి చేయాల‌న్నారు. సీఎం చంద్రబాబు నాయుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌, స్పీడ్ ఆఫ్ డూయింగ్ వ‌ర్క్ విధానాన్ని తీసుకొచ్చార‌న్నారు. అందుకు త‌గ్గట్టే అంద‌రూ ప‌నులు త్వర‌గా చేయాల‌న్నారు. ప్రజ‌ల‌కు మంచి పాల‌న అందించడంలో అంద‌రూ భాగ‌స్వామ్యం అవ్వాల‌న్నారు.స‌మావేశంలో కాంట్రాక్టర్లు మాట్లాడుతూ కూట‌మి ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత త‌మ‌లో ఆత్మస్థైర్యం పెరిగింద‌న్నారు. ప‌లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బిల్లుల విష‌యంలో ఆల‌స్యమ‌వ్వకుండా చూడాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. ఫైల్స్ క్లియ‌రెన్స్ త్వర‌గా చేయాల‌న్నారు. స‌మావేశంలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ య‌స్. ర‌వీంద్ర బాబు, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

బిజినెస్​, మున్సిపల్​ కమిషనర్​, అధికారులు,

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *