22 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min readగ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం.. కాటసాని రాంభూపాల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలంలోని గని గ్రామంలో దాదాపు 22 కోట్ల రూపాయలతో చేసిన పలు అభివృద్ధి పనులను మంగళవారం నాడు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంపౌండ్ వాల్ 94 లక్షలు ఆర్ బి కే 24 లక్షలు హెల్త్ సెంటర్ 21 లక్ష, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ గ్రావెల్ రోడ్డు 7కోట్ల 50 లక్షలతో నిర్మించిన వాటిని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ టీడీపీ నాయకులు ప్రజలకు మభ్యపెట్టి మాటలు చెబుతున్నారని ఆరోపించారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా మోసం చేశాడరన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోచేశారని ధ్వజమెత్తారు. దీంతో వివిధ పథకాలకు అర్హులైన ప్రజలు ఎంతో ఇబ్బందుల పడ్డారని గుర్తుచేశారు. చంద్రబాబు పరిపాలనంతా కరువుమయన్నారు. టీడీపీ ఆధికారంలో ఉన్న సమయంలో వర్షాలు పడక ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడి, వ్యవసాయం మానివేశారన్నారు. 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ఆయకేదక్కుతుందన్నారు. అదేవిధంగా 1994-2004 చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వర్షాలు పడక కరువు ఏర్పడిందని గుర్తుచేశారు. 2004-2014 సీఎంగా బాధ్యతలు చేపట్టి దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సకాంలో వర్షాలు పడటంతో పంటలు బాగా పండడం తో పాటు, అనేక సంక్షేమపథకాలు అందించడం రైతులు వ్యవసాయం పండగలా చేశారన్నారు. పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే సంక్షేమపథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. వలంటీరు, సచివాలయ వ్యవస్థలు ఎంతో బాగా పనిచేస్తున్నాయని గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం వచ్చిందన్నారు. జెడ్పీ హైస్కూల్ లలో నాడు-నేడు పథకం, సోలార్ నిధులు కలిపి రూ.1.39 కోట్లతో పాఠశాల రూపురేఖలు మారిపోయన్నారు. మరింత సంక్షేమం, అభివృద్ధి గ్రామాలు చెందడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో కార్పోరేట్ చదువులు చదవాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుందామని కోరారు. గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ని గ్రామస్తులు, రైతులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సోలార్ సీఈఓ మురళీకృష్ణారెడ్డి, పాణ్యం మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ నాగమద్దమ్మ, సింగిల్ విండో చైర్మన్ పోగుల చంద్రశేఖరరెడ్డి, పార్టీ మండల ఆధ్యక్షుడు శివరామిరెడ్డి, వైస్ ఎంపీపీ కాలునాయక్, జేఏసీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు శిరుప శ్రీనివాసరెడ్డి, సర్పంచ్లు కత్తి తులషమ్మ, రామ్మోహన్రెడ్డి ఉప సర్పంచ్ శివానందరెడ్డి . సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మేఘనాధరెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.