దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. చౌడేశ్వరి ఆలయంలో మూల విరాట్ అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు గణపతి పూజ. అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు కుమార్చనతో పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు కావడంతో అమ్మవారి అలంకారాన్ని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ వాసవి కనకా పరమేశ్వరి ఆలయంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి ఆర్యవైశ్యులు వాసవి మాత కలశంతో దంపతుల చేతులమీదుగా దేవస్థానం వరకు ఊరేగింపుగా వచ్చారు. అనంతరం అమ్మవారికి దీక్షాబంధన అలంకారం నిర్వహించారు. అమ్మవారి నీ దర్శించుకునే భక్తులకు ప్రసాదాలు అందజేశారు. రాత్రి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు. చెన్నూరు తో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు చౌడేశ్వరి దేవి. వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయాళ ఎదుట విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్ లో ఏర్పాటు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.