దేవిశ్రీ ఉదారత..
1 min readసినిమా డెస్క్ : ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్. ఆగస్టు 2వ తేదీ ఆయన పుట్టిన రోజు. ఈ అకేషన్ సందర్భంగా.. టాలీవుడ్ ప్రముఖులంతా డీఎస్పీకి గ్రీటింగ్స్ చెప్పారు. అయితే సెలబ్రిటీలంతా స్టార్ హోటల్స్ లో గ్రాండ్ గా పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవడం పరిపాటి. కానీ.. దేవిశ్రీ మాత్రం అనాథ బాలల మధ్యలో తన పుట్టిన రోజును జరుపుకుని తన ఉదారత చాటారు. ఏపీలోని విజయవాడ గన్నవరంలోని ‘డ్యాడీస్ హోమ్’లో ఉన్న అనాథ చిన్నారుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆడిపాడారు. వారిలో కలిసిపోయి పాటలు పాడుకున్నారు. వారిని ఎత్తుకొని ఆనందించారు. ఈ సందర్భంగా.. వారి పరిస్థితిని చూసి చలించిపోయారు. అందుకే.. వారికి ఏదోవిధంగా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు.. ఈ నెల మొత్తం ఆ హోమ్ లో ఉన్న చిన్నారులకు కావాల్సిన సరుకులన్నీ ఇవ్వడానికి ముందుకొస్తూ.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘మీ ప్రేమాభిమానాలకు ఇదే నా వందనం. నా బర్త్ డే సందర్భంగా మీకో విషయం చెప్పాలని అనుకుంటున్నాను. గన్నవరంలో డ్యాడీస్ హోమ్ అని ఒక అనాథాశ్రమం ఉంది. తల్లిదండ్రులు లేని వందలాది మంది చిన్నారుల బాగోగులను పట్టించుకుంటోంది. ఈ చిన్నారులపై వారు చూపించే శ్రద్ధ నిస్వార్థ సేవ నా మనసును తాకింది. గతంలో సర్ ప్రైజ్ అంటూ నన్ను ఇక్కడికి తీసుకురాగా.. వాళ్ల కోసం నేను మ్యూజిక్ ప్లే చేశాను. అప్పటి నుంచి వాళ్లతో కనెక్ట్ అయిపోయాను. ఈ ఆశ్రమంలోని కొందరు చిన్నారుల బాగోగులను చూసుకోవడం నా బాధ్యతగా స్వీకరిస్తున్నా. అలాగే అందరికీ ఈ నెలకు సరిపడా సరుకులు అందిస్తాను’’ అని తెలిపారు దేవీశ్రీ ప్రసాద్.