వరవిన మల్లేశ్వరస్వామి జాతరకు తరలిన భక్తులు
1 min read
కర్ణాటకలోని తెక్కలకోట వద్ద వెలసిన స్వామి వారు
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద నుంచి మల్లేశ్వరుడిని వరించిన స్వామితో ఊరేగింపుగ వెళ్తున్న దృశ్యం హొళగుంది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగువృతాలూక లెక్కలకోట గ్రామ కొండల్లో వెలిసి హొళగుంద లోని బోయ కులస్తుల ఆరాధ్య దేవుడిగా పూజింపబడుతున్న శ్రీవరవిన మల్లేశ్వరస్వామి జాతర ఉత్సవాలకు శుక్రవారం స్థానిక భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూక తెక్కలకోట గ్రామానికి 4 కి.మీ దూరంలోని కొండలో వెలసిన శ్రీవరవిన మల్లేశ్వరస్వామిని మండలంలోని వాల్మీకులు, అగ్రహారం బోయ కులస్తులు, కొన్ని దళిత కుటుంబాలు కొలుస్తాయి. ప్రతి ఏటా స్వామి రధోత్సవానికి ముందు దేవుడికి బండారం సమర్పించెందుకు గాను మల్లేశ్వరుడిని వరించిన స్వామితో కలిసి భక్తులు డోలు, మేళతాళాలతో హొళగుంద నుంచి కర్ణాటకకు ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితి. అందులో భాగంగా శుక్రవారం హొళగుందకు దాదావు 30 కి.మీ. దూరంలో ఉన్న స్వామి సన్నిధికి చేరుకునెందుకు చెప్పులు లేకుండా కాలినడకతో కర్ణాటకకు బయలుదేరారు. అగ్రహారం బోయ కులస్తులు వెళ్లేంతవరకు అక్కడ ఎలాంటి ఉత్సవ కార్యక్రమాలు జరగవు. ఈ ఉత్సవానికి హొళగుందతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. వరవిన మల్లేశ్వరస్వామి జాతరలో భాగంగా ప్రతి ఏటా అమావాస్య నుంచి రధోత్సవం వరకు స్వామిని కొలిచే ఇక్కడి భక్తులు 15 రోజుల పాటు కఠోర దీక్షను పాటిస్తారు. తెక్కలకోట సమీపంలోని కొండల్లో వెలసిని స్వామి సన్నిదికి చేరుకున్న భక్తులు కొండ పై వెలిసిన ఆలయంలో ఉన్న 60 కేజీల వెండి త్రిశూలాన్ని, దేవుడిని దిగువకు తెచ్చి ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం కనుల పండువుగా రధోత్సవం నిర్వహించారు. మరుసటి రోజు మల్లేశ్వరుని పై అలిగి దూరంగా ఉంటున్న మాళమ్మ విగ్రహాన్ని తెచ్చి మల్లేశ్వరునితో వివాహం జరువుతారని వాల్మికి పెద్దలు చెప్పారు.

