శ్రీ మద్ది ఆంజనేయ స్వామి మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు..
1 min read– వివిధ సేవల రూపేణ రూ: 1,19,334/- ఆదాయం..
– సుమారు 800 మందికి నిత్య అన్నదాన ప్రసాద వితరణ..
– ఈవో ఆకుల కొండలరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము మంగళవారం సందర్భముగా అధిక సంఖ్యలో భక్తులు, విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీస్వామివారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించుకొన్నారు. ఈరోజు మద్యాహ్నం గం.1.00 ల. వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.1,19,334/- లు సమకూరినది. సుమారు 800 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈరోజు ఆలయము వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించినారు. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెల్పినారు.