పెగాసెస్ చంద్రబాబు కొనలేదని డీజీపీనే చెప్పారు !
1 min readపల్లెవెలుగువెబ్ : చంద్రబాబు హయాంలోనే పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొన్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నాటి చంద్రబాబు ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా నీ సవాంగన్నే చెప్పారు జగన్ రెడ్డి… సమాచార హక్కు చట్టం ప్రకారం 25-7-21న కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు అటువంటి సాఫ్ట్ వేర్ ఏదీ కొనలేదని స్వయంగా నాటి డీజీపీ సవాంగ్ 12-8-21న సమాధానం ఇచ్చారు. తాను, తన మీడియా చేసేవన్నీ అసత్య ప్రచారాలే అని స్వయంగా జగన్ బయటపెట్టడమే దేవుడి స్క్రిప్ట్..’’ అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు.