రామానుజ జీయర్ స్వామివారి ధార్మిక పర్యటన
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీమద్ అష్టాక్షరీ పీఠం – విజయవాడ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారు ధార్మిక పర్యటనలో భాగంగా ఈనెల 5వ తేదీ, గురువారం బద్వేలు లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం, పోరుమామిళ్ళ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం, అదేరోజు సాయంత్రం కలసపాడు లోని వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని శ్రీకృష్ణ మందిరం లకు రానున్నట్లు గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజ గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, కలసపాడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మలిపెద్ది నాగరాజు, మహిళా మండలి అధ్యక్షురాలు తుమ్మలపెంట సత్యవతమ్మ, పెద్దశ్రేష్ఠి భవనాశి పూర్ణయ్య, యువజన సంఘం అధ్యక్షులు కామిశెట్టి జయకృష్ణ, గ్రామ సర్పంచ్ ఎడమకంటి శివలీల శ్రీదర్, ఉపసర్పంచ్ పులి వెంకటమ్మ, కలసపాడు మండల అర్చక పురోహిత సంఘం అధ్యక్షులు వారణాశి వేంకట రమణయ్య, తెలిపారు. సనాతన భారతీయ తాత్విక చింతన వ్యాప్తి కొరకు, సమాజంలోని రుగ్మతలు తొలగించి, శాంతిని నెలకొల్పుటకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ పర్యటన చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమాజహితైషులు, సామాజిక కార్యకర్తలు, వివిధ ధార్మిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొనగలరని విజ్ఞప్తి చేశారు.