ధార్మిక సప్తాహ ముగింపు కార్యక్రమం
1 min read– లలితా పీఠంలో సత్యనారాయణ స్వామి వ్రతం మరియు కార్తిక దీపోత్సవం
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు లోని శ్రీ లలితా పీఠం నందు గత వారం రోజులుగా జరుగుతున్న ధార్మిక సప్తాహ కార్యక్రమాలలో భాగంగా ముగింపు సందర్భంగా 108 పైగా దంపతులచే వేదపండితులు మామిళ్ళపల్లి జగన్మోహన శర్మ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము, కార్తిక దీపోత్సవం జరిగింది. అక్టోబర్ 31 వ తేదీ ప్రారంభమైన ధార్మిక సప్తాహంలో భాగంగా ప్రతిరోజు ధార్మిక ప్రవచనాలు, భజనలు, గోపూజ, భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ సనాతన భారతీయ వైదిక ధర్మాన్ని వ్యాప్తి చేయుటకు తిరుమల తిరుపతి దేవస్థానములు మనగుడి అనే పేరుతో సమాజంలో భక్తి భావనను వ్యాప్తి చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో లలితా పీఠం పీఠాధిపతులు శ్రీగురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, తి.తి.దే. రాయలసీమ క్లస్టర్ సూపరింటెండెంట్ ఇ.ఢిల్లీరెడ్డి, కర్నూలు ఐదవ వార్డు కార్పోరేటర్ జి.ఎల్.వి. సుజాత శేషుయాదవ్, లలితా సహస్రనామ సంఘం అధ్యక్షురాలు తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ , సి.డి.పి.ఒ.ఎన్.వరలక్ష్మీదేవి, వాసవి సంఘం గజ్జెల లక్ష్మీ నారాయణ, ఎలుకూరు ద్వారకానాథ్, రిటైర్డ్ సిడి.పి.ఓ.భవాణి, అమ్మవారి శాల అధ్యక్షులు బైసాని అంజనీ ప్రకాశ్, విష్ణు వర్ధన్ రెడ్డి, సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.