PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :సిపిఐ సిపిఎం కాంగ్రెస్ రైతు సంఘం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక హోళగుంద మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి. రైతులకు సంబంధించిన రైతు సమస్యల వినతి పత్రాన్ని తహసిల్దార్ ఏ.ఎం. ప్రసాద్ రాజు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం నాయకుడు తిమ్మయ్య సిపిఐ మండల కార్యదర్శి పెద్దహ్యట మారెప్ప సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ మాట్లాడుతూ 540 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిషన్ మోర్చా మార్చ 14న ఢిల్లీ రాంలీల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభా ద్వారా దేశంలో 70% పైగా ఉన్న రైతులు కవులు రైతులు వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం గొంతింటి నాదించాలని పిలుపునిచ్చింది ఈ పిలుపులో కార్మిక వర్గాలు ఇతర సోదర సంఘాల చెయ్యి కలపాలని కోరింది. కేంద్ర బిజెపి ప్రభుత్వం 2021 డిసెంబర్లో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ బయలుదేరిన రైతంగాని హర్యానా సరిహద్దులలోని అడ్డగించింది కందకాలు తవ్వడం మేకలు నాటడం మార్కెట్లు ముల్లకంచలు ఏర్పాటు చేయడం వాటర్ క్యాన్లు ఉపయోగించడం రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించడంతోపాటు డ్రోన్ల ద్వారా విషవాయువుల చిమ్మించింది ఈ చర్యల వల్ల అనేకమంది రైతులు కళ్ళు చూపు కోల్పోవడం చెవులు వినపడకపోవడం జరిగింది కాల్పుల్లో యువ రైతు శుభాకాంక్షలు అనే యువరైతు మృతి చెందాడు మరో ముగ్గురు రైతులు గుండె ఆగి పోయాయి ఈ దాడిలో 200 ట్రాక్టర్ల ధ్వంసం ప్రసార చానల్స్ నిలిపివేశారు ఈ దుర్గతాన్ని హర్యానా బిజెపి ప్రభుత్వం పోలీసులు కేంద్ర ప్రభుత్వం బలగల పంజాబ్ సరిహద్దుల్లో లోపలకు చొరబడి నిర్వహించాయి బిజెపి ప్రభుత్వం రైతన్న కర్మషంగా వ్యవహరిస్తుందని ఈ కాలంలో నాలుగు సార్లు చర్చలు జరిగిన ఏ పురాగతి లేదు. రైతులు తమ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అడగడం తప్ప మీకు రైతులపై ఏ మాత్రం ప్రేమ ఉన్న వెంటనే రైతుల అడిగిన డిమాండ్లను నెరవేర్చాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

డిమాండ్స్

1.స్వామినాథ్ కమిటీ సిఫారసుల ప్రకారం అన్ని పంటలకు సీ2+50% ప్రకారం మద్దతు ధర చట్టం చేయాలి

2.రైతుల రుణమాఫీ చేయాలి కేరళ తరహాలో రుణ ఉపసమాన చట్టం చేయాలి

3.రైతు ప్రయోజనాలకు అనుగుణంగా సమగ్ర పంటలు బీమా పథకం పెట్టాలి.

4_హర్యానా బార్డర్లో రైతులపై కాల్పులు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలి._

5.విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసాహరించాలి స్మార్ట్ మీటర్ల నిలుపుదల చేయాలి.

6.భూ హక్కుల చట్టం 27/23ను ఉపసహరించాలి చుక్కల భూములు బంజర భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలి.

7.నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలి.

8.కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు అమలు చేయాలి.

9.ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్ల కేటాయించి 200 రోజులకు పని దినాలు పెంచాలి. కనీస వేతనం 600కు పెంచాలి రెండు పూటల పని ఆన్లైన్ మాస్టర్ రద్దు చేయాలి.

10.60 సంవత్సరముల నిండిన పేద రైతులకు వ్యవసాయ నెలకు 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి.

ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రంగన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంగయ్య సిపిఐ సిపిఎం రైతు సంఘం నాయకులు సీనియర్ నాయకులు కట్టప్ప సలాం సాబ్ హినహిత్ రవి సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు మల్లయ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author