టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ధర్నా..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఉదయం నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద సిఐడి అధికారులు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతో నిరసనగా శనివారం నాడు గడివేముల మండల కేంద్రంలో మండల టిడిపి నాయకులు కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా మండల టిడిపి అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలు నుండి వైసీపీ నాయకులు చేసిన అవినీతి కప్పిపుచ్చుకోవడానికి టిడిపి అధినేత అరెస్టు డ్రామాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీపీ మంచాలకట్ట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అరెస్టు బూటకమని టిడిపి పార్టీ తరఫున దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని కేసు నిలబడదని రాబోయే ఎన్నికల్లో టిడిపి భారీ మెజార్టీతో గెలిచి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఈ రాష్ట్రానికి పట్టిన అరాచకశక్తిని పారదోలుతారని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దేశం సత్యనారాయణరెడ్డి. వంగాల శ్రీనివాసరెడ్డి. పంట రామచంద్రారెడ్డి బిడుదూరి సీతారామరెడ్డి. బత్తుల సుభద్రమ్మ. ఒడ్డు లక్ష్మీదేవి. ఐ టి డి పి మండల ఉపాధ్యక్షుడు సభ్యుడు బివియన్ రాజు టిడిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు .