హమాలీ కాలనీ ప్రజలకు రక్షణ కల్పించాలని ధర్నా
1 min read– మా డివిజన్ కార్పొరేటర్ భర్త పై తప్పుడు కేసులు పెట్టడo అన్యాయం
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా ఒకటవ డివిజన్ కొమడవోలు హమాలీ కాలనీలోప్రజలకు,మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలనీ, అరాచక వ్యక్తుల నుండి కాపాడాలని కోరుతూ ఐ.ఎఫ్.టి.యు.అనుబంధ హమాలీ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కొమడవోలు హమాలీ కాలనీలో నిరసన కార్యక్రమం జరిగింది.ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.తమ కాలనీలో సీ.సీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ,రోడ్లు,డ్రైన్లు, కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాలనీ,మహిళల రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.కాలనీ ప్రజలకు మద్దతుగా కొమడవోలు స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మంగరాజు రాము అధ్యక్షతన జరిగిన సభలో కొమడోలు మాజీ ఎంపీటీసీ వీరంకి భాస్కర రావు, ఐ.ఎఫ్.టి.యు.జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు,నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, కాలనీ మహిళలు పల్లి పద్మ, చల్లా సావిత్రి, చల్లా వాణి, చిప్పాడ ఆదిలక్ష్మి తదితరులు మాట్లాడారు.గత 20 సంవత్సరాల క్రితం హమాలీ కార్మికులు శ్రమతో ఏర్పాటు చేసుకున్న ఈ కాలనీలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు.తమ కాలనీలోకి కొంతమంది అరాచక వ్యక్తులు ప్రవేశించి భయబ్రాంతులు స్రృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పక్క కాలనీలోని ఇద్దరు పురుష వాలంటీర్లు ఈ కాలనీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు తెలియజేశారు.దీనిపై స్పందించి పరిష్కరించడానికి వచ్చిన మా కార్పొరేటర్ భర్త పై దాడి చేశారని ఆయనపై వారి కుటుంబం సభ్యులపై లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తూ కేసులు పెట్టి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అన్యాయమని ఇది పూర్తి అవాస్తవమని మహిళలు పెద్ద ఎత్తున ముక్తకంఠంతో వాపోయారు, ఇటువంటి అరాచకాలు సృష్టిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరారు,ఆ వాలంటీర్లను కాలనీ నుంచి మరొక చోటకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.కాలనీ ప్రజలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు.కాలనీ ప్రజలకు మద్దతుగా కొమడవోలు స్థానిక ప్రజలు యాదగిరి చినబాబు,మిడతా నటరాజ్,యార్లగడ్డ నాగరాజు,తాతా శ్రీనివాసరావు,యార్డ్ హమ్మాలీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు యర్రా శ్రీనివాసరావు,పల్లి గంగరాజు,సూరిబాబు,శ్రీను,రమణ,కృష్ణ, గంటా శ్రీను,రమేష్ స్థానిక కానీ ప్రజలు పల్లి శ్రీను,చల్లా బాలాజీ భారతి,మంగ,చిన్ని,చాందిని,జ్యోతి,క్రృష్ణవేణి తదితరులు నాయకత్వం వహించారు. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని తెలియజేశారు.