పొగాకు రైతులతో ధర్నా….
1 min read
పొగాకు పంటను క్వింటానికి రూ: 15 వేలు తో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఏపీ రైతు సంఘం అధ్యక్షులు పి. రామచంద్రయ్య
పత్తికొండ, న్యూస్ నేడు: పొగాకు పంటను క్వింటానికి రూ: 15 వేలతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంద్రప్రదేశ్ రైతు సంఘం (ఏ ఐ కె ఎస్) రాష్ట్ర అధ్యక్షులు పి. రామచంద్రయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.శనివారం కర్నూలు జిల్లా పత్తికొండ లో ప్రధాన రహదారిలో స్థానిక నాలుగు స్తంభాల దగ్గర రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమనికి హాజరైన పి. రామచంద్రయ్య పొగాకు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, పొగాకు పంటను పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.పత్తికొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో జి. పి. ఐ. కంపెనీ సంస్థ వారు గ్రామాలు తిరిగి పొగాకు పంటను సాగు చేయాలని క్వింటానికి రూ: 15 వేలు ఇస్తామని రైతులకు చెప్పారని తీరా పంట చేతికి వచ్చే సమయానికి చేతులు ఎత్తేసారని విమర్శించారు.జి. పి. ఐ. కంపెనీ సంస్థ సూచన, సలహాలు మేరకు ఈ ప్రాంత రైతులు పొగకు పంటను సాగు చేసారని చెప్పారు.ఐతే పంట చేతికి వచ్చిన తరువాత కొనుగోలు కేంద్రానికి తీసుకు పోగా చాలా తక్కువ ధరకు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని ఇది చాలా దుర్మార్గపు చర్య అని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని పార్లమెంటులో చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా రైతులను ఏమాత్రం పట్టించు కోవడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే రైతులకు మేలు చేస్తాం.