మధుమేహాన్ని తగ్గించే పాదరక్షలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : మధుమేహంతో బాధపడే వారికి శుభవార్త. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ప్రత్యేకంగా త్రీడీ ప్రింటెడ్ పాదరక్షలు రూపొందించారు. వీరు అభివృద్ధి చేసిన ఈ పాదరక్షలు ధరిస్తే మధుమేహం కంట్రోల్‌లో ఉంటుందని వారు చెబుతున్నారు. పాదాలకు అయిన గాయాలను చాలా త్వరగా మానేలా ఇవి చేస్తాయని, పాదాల్లో గాయాల విస్తరణను నియంత్రిస్తాయని ఐఐఎస్సీ మంగళవారం పేర్కొంది. ఆటోమేటెడ్ అప్‌లోడ్ ఇన్‌సోల్ స్నాపింగ్ సాంకేతికతను ఇందులో పొందుపరిచామన్నారు. డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతిగా ఈ పాదరక్షలు ఉపయోగపడతాయి. పాదాల పై సమాన ఒత్తిడి వచ్చేలా చేసి సమస్యను క్రమేపీ నియంత్రించనున్నాయి.