డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం..
1 min read-టిటిడి పాలకమండలి సభ్యులు వై సీతారామిరెడ్డి
మంత్రాలయం, పల్లెవెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో డయాగ్నోస్టిక్ సెంటర్ అందుబాటులోకి రావడం ప్రజలకు, భక్తులకు శుభ పరిణామమని టిటిడి పాలకమండలి సభ్యులు వై సీతారామిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన బాంధవ్య డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే పరీక్షలకు ఎమ్మిగనూరు లేదా ఆదోని కర్నూలు వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేదని ప్రస్తుతం డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు వల్ల ప్రజలకు సమయం వృథా కాకుండా తక్కువ ఖర్చుతో పరీక్షలు చేయించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డయాగ్నోస్టిక్ సెంటర్ ఇంచార్జీ కిషన్ రావు (గోర్కల్ కృష్ణస్వామి) కె. మల్లికార్జున మాట్లాడుతూ పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థుల ఆశిస్సులతో రాంపురం రెడ్డి సోదరుల సహాకారంతో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సెంటర్ కు రాలేని వారు 6305328844 నెంబర్ కు ఫోన్ చేసి వారి ఇంటి వద్దకు వచ్చి రక్త సేకరణతో పరీక్షలు నిర్వహించి రిపోర్టును తెలపగలరని సూచించారు. డాక్టర్ వినయ్ ఎంబిబిఎస్, ఎండిఆర్డి, డాక్టర్ జి. మధుసూదన్ ఎంబిబిఎస్, ఎండి పతోలజీ వారి సారధ్యంలో స్మార్ట్ ఫుల్ బాడీ చెకప్ పేరుతో ఆఫర్ ద్వారా 1500/-రూపాయల ఖరీదు గల పరీక్షలను కేవలం 399/-రూపాయలకు, ఫేవర్ ప్రొఫైల్ చెకప్ పేరుతో 1100/-రూపాయలు ఖరీదు గల పరీక్షలను కేవలం 349/-రూపాయలకు, 500/-రూపాయలు ఖరీదు గల థైరాయిడ్ టి3, టి4, టిఎస్ హెచ్ వంటి పరీక్షలు కేవలం 199/-రూపాయలకే చేయబడుతుందని ఈ అవకాశం కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఉప సర్పంచ్ హోటల్ పరమేష్ స్వామి యంపిటిసి జి. వెంకటేష్, నాయకులు జనార్దన్ రెడ్డి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.