19న డయల్ యువర్ కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19 తేదీ నుండి ప్రతి సోమవారం స్పందన – డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ కారణంగా స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం మధ్యాహ్నం 11 గంటల నుండి 1 గంట వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 08518-277100 నెంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ ద్వారా రసీదు అందజేస్తామన్నారు.