ప్రతి బుధవారం డయల్ యువర్ ఈఓ
1 min read
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానం రేపటి నుండి డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని రాష్ట్రదేవదాయ కమీషనర్ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమము చేపట్టబడింది. ప్రతి బుధవారం రోజున ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులు తమ సూచనలు, సలహాలను నేరుగా కార్యనిర్వహణాధికారివారికి ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు. ఈ డయల్ యువర్ ఫోన్ కార్యక్రమములో భక్తులు ఫోన్ నెం.08524-287111కు కాగా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పలు ఏర్పాట్లను చేస్తోంది. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టబడ్డాయి. ముఖ్యంగా భక్తులకు తగిన వసతి, సౌకర్యవంతమైన దర్శనం, అన్నప్రసాద వితరణ పలు అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా వైద్య ఆరోగ్యపట్ల కూడా పలు చర్యలు తీసుకోబడుతున్నాయి. ముఖ్యంగా స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అలాగే క్షేత్ర సుందరీకరణకు కూడా ప్రణాళికబద్ధంగా ఆయా పనులు చేపట్టడం జరుగుతోంది. కాగా భక్తులు ప్రతి బుధవారం జరిగే డయల్ యువర్ ఈఓ కార్యక్రమములో సూచనలు, సలహాలతో అందుకు అనుగుణంగా సౌకర్యాలను మరింతగా పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.