NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌డ‌ప జిల్లాలో వ‌జ్రాల గ‌నులు !

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : క‌డ‌ప జిల్లాలోని పెన్నాన‌ది బేసిన్ ప్రాంతంలో వ‌జ్రాల ల‌భ్యత ఉన్నట్టు జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. దేశవ్యాప్తంగా ఖ‌నిజాణ్వేష‌ణ జ‌రిపిన ఈ సంస్థ .. జీ-4 స్థాయి ప‌రిశోధ‌న అనంత‌రం వంద మిన‌ర‌ల్ బ్లాకుల నివేదిక‌ల‌ను సిద్ధం చేసింది. క‌డ‌ప జిల్లా ఉప్పర‌ప‌ల్లె ప‌రిస‌ర ప్రాంతంలో 37.65 చ‌.కి.మి. ప‌రిధిలో వ‌జ్రాల ల‌భ్యత‌కు అవ‌కాశం ఉన్నట్టు జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. నెల్లూరు జిల్లా ప‌రిధిలో బేస్ మెట‌ల్, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం ప్రాంతాల్లో మాంగ‌నీస్ బ్లాక్ లు ఉన్నట్టు జీఎస్ఐ తెలిపింది. ప్రకాశం జిల్లాలో ఐర‌న్ ఓర్ బ్లాక్ లు ఉన్నాయ‌ని జీఎస్ఐ తెలిపింది.

About Author