ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలో వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు పరిపాలించేందుకు ప్రజలు తమను గెలిపించారని, తగ్గించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ముందస్తు ఎన్నికలపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నారని వ్యాఖ్యానించారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సజ్జల వెల్లడించారు.