థర్డ్ వేవ్ మొదలైందా ?
1 min readపల్లెవెలుగువెబ్ : భారత్ లో థర్డ్ వేవ్ మొదలైందా ? అంటే రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఆ ప్రశ్నకు బలం చేకూరుస్తున్నాయి. ప్రధాన నగరాల్లో విచ్ఛలవిడిగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. గతవారం రోజుల్లో కేసుల్లో భారీ పెరుగుదల.. దేశంలో థర్డ్ వేవ్‌ను సూచిస్తోందని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. అయితే, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. వ్యాధి తీవ్రత, ఆస్పత్రి బారినపడకుండా రక్షణ పొందాలంటే రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆయన స్పష్టంచేశారు. వీటితోపాటు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.