NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

4జీ నుంచి 5జీకి మారండ‌ని మెసేజ్ వ‌చ్చిందా.. అయితే జాగ్ర‌త్త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : 5జీ సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇదే అదునుగా భావించే సైబర్‌ నేరగాళ్లు కొత్త స్కామ్‌లకు తెరలేపి అందినంతా దోచేస్తున్నారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 5జీ సేవల వినియోగం కోసం కస్టమర్లు ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలో ‘4జీ నుంచి 5జీ మారండి. మీకు కావాల్సిన సేవలు మేం అందిస్తాం’ అంటూ.. కొంతమంది సైబర్‌ కేటుగాళ్లు మెసేజ్‌లు, లింక్‌లు పంపిస్తున్నారు. అదంతా నిజమని నమ్మిన కస్టమర్లు ఆ లింక్‌లను క్లిక్‌ చేస్తే ఫోన్‌లోని డేటా అంతా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుందన్నారు. దాంతో బ్యాంకు ఖాతాలకు లింక్‌ అయి ఉన్న ఫోన్‌నంబర్‌ తెలుసుకుంటారన్నారు. ఆ నంబర్‌ను బ్లాక్‌ చేయించి, సిమ్‌ స్వాప్‌ దందాకు పాల్పడి, అదే నంబర్‌తో మరోసిమ్‌ తీసుకుని బ్యాంకు ఖాతాలకు లింక్‌ చేసి డబ్బంతా కొల్లగొడతారని హెచ్చరిస్తున్నారు.

                                 

About Author