జీబ్రాలు నిలబడి నిద్రపోతాయని మీకు తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : జీబ్రాలు ఆసక్తికర జీవన విధానాన్ని అవలంబిస్తాయి. అడవుల్లో సుమారు 1,000 వరకు గంపులుగా తిరుగుతాయి. అవి గంటకు 40 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తుతాయి. ఇవి తిన్నగా కాకుండా అడ్డదిడ్డంగా పరుగెడుతాయట. అందుకే వేటగాళ్లకు ఇవి దొరకవట. ఒకవేళ వేటగాళ్లుగానీ, హైనా, సింహం తదితర క్రూర మృగాలుగానీ వాటిని వేటాడినప్పుడు వెనుక కాళ్లతో తన్ని వాటిని అవే రక్షించుకుంటాయి. పిల్ల జీబ్రా కూడా పుట్టిన గంటకు పరుగెడుతుందట. వీటిలో మరో విశేషమేమంటే ఇవి నిలబడే నిద్రపోతాయి. ఏ రెండు జీబ్రాలకు వాటి శరీరంపై ఉన్న చారలు ఒకేలా ఉండవు. ఇవి వాటిపై దాడిచేసే క్రూర మృగాలను తికమకపెడతాయట.