NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌లేను అన్నార‌ట ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నంద‌మూరి బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా ఆహా ఓటీటీ వేదిక‌గా ప్ర‌సార‌మ‌వుతున్న టాక్ షో అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బీకే. ఈ షోకు తాజాగా ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి, బాల‌కృష్ణ కాంబినేష‌న్ గురించి చ‌ర్చ జ‌రిగింది. ‘‘ఇప్పటివరకూ మన కాంబినేషన్‌ పడలేదు. నా అభిమానులు మిమ్మల్ని ‘బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు’ అని అడిగితే ‘బాలకృష్ణను నేను హ్యాండిల్‌ చేయలేను’ అన్నారట ఎందుకు’’ అని ప్రశ్నించగా ‘‘భయంతోనే అలా అన్నాను. చిన్న వాళ్ల దగ్గరి నుంచి పెద్ద వాళ్ల వరకూ మీరు అందరికీ గౌరవం ఇస్తారు. చాలా పద్ధతిగా ఉంటారు. నేను సినిమా షూటింగ్‌ చేసేటప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు. నాకు ఎవరైనా ‘గుడ్‌ మార్నింగ్‌’ చెబితే చిరాకు. షాట్‌ పెట్టుకుని పక్కన హీరో ఎండలో నిలబడ్డాడా? వానలో నిలబడ్డాడా? అన్నది చూడను. నా ఫ్రేమ్‌ రెడీ అయ్యే వరకూ హీరో కష్ట సుఖాలు ఆలోచించలేను. ఒక వేళ మిమ్మల్ని డైరెక్ట్‌ చేయాల్సి వస్తే, మీకేమైనా కోపం వస్తుందేమోనని భయం. నాకు అదే టెన్షన్’’ అని సమాధానం ఇచ్చారు.

                                             
  

About Author