బెంగాల్ లో దీదీ.. తమిళనాట స్టాలిన్
1 min readపల్లె వెలుగు వెబ్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి పుట్టించాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్రంలో ఉన్న బీజేపీ పశ్చిమ బెంగాల్ లో సర్వశక్తులు ఒడ్డుతూ.. ఎన్నికల కదనరంగంలోకి దూకితే.. తమిళనాడులో మిత్రపక్షమైన అన్నాడీఎంకేకు అన్ని రకాలుగా సహకరిస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని నిలుపుకోవడానికి సీఎం మమత బెనర్జీ అహర్నిషలు శ్రమిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు డీఎంకే మిత్రపక్షలతో కలిసి కూటమిగా పోరాటం చేస్తున్నారు. అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉంది. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనే అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రైవేటు సర్వే సంస్థలు తమ సర్వేలను విడుదల చేశాయి.
టైమ్స్ నౌ సంస్థ సీఓటర్ తో కలిసి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో…
పశ్చిమబెంగాల్ లో 294 సీట్లుండగా..
తృణమూల్ కాంగ్రెస్- 160 సీట్లు
బీజేపీ-112 సీట్లు
కాంగ్రెస్- వామపక్షాలు కలిపి-22 సీట్లు సాధిస్తాయని అంచనా వేసింది.
తమిళనాడులోని డీఎంకే కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని ఈ సర్వే తెలిపింది.
తమిళనాడులో మొత్తం సీట్లు- 234
డీఎంకే కూటమి- 177 సీట్లు
అన్నా డీఎంకే- 49 సీట్లు రావచ్చని అంచనా వేసింది.
మరో వైపు కేరళ ఎన్నికల్లో సీపీఐ-సీపీఎం కూటమి అత్యధికంగా 77 స్థానాలు గెలుచుకుని .. అధికారాన్ని నిలబెట్టుకుంటారని అంచనా వేసింది.