‘చస్తే చావండి ’.. విద్యార్థుల తల్లిదండ్రులపై మంత్రి ఆగ్రహం !
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఆన్ లైన్ లో పాఠశాలలు క్లాసులు నిర్వహించాయి. అయితే.. గతంలో లాగే ఫీజు డిమాండ్ చేశాయి. ఏడాది పొడువునా పాఠశాలలు మూసినా.. పూర్తీ ఫీజు ఎందుకు చెల్లించాలని మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ మంత్రి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘ మమ్మల్ని ఏం చేయమంటారు సార్. చావమంటారా ?.’ అంటూ ప్రశ్నించారు. దీంతో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చస్తే చావండి’ అంటూ కోపోద్రిక్తులయ్యారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ బాధల్ని చెప్పుకోవడానికి వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రుల పై మంత్రి వ్యాఖ్యలను పలువురు ఖండించారు.