PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులకు  చెక్కులు అందజేత..

1 min read

జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి

ఏ.డి రాకడమణి ఆధ్వర్యంలో రుణాలు పంపిణీ..

పల్లెవెలుగు వెబ్​ ఏలూరు  ప్రతినిధి : జిల్లాలో విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులు కుటుంబపోషణకు ఆర్ధిక వెసులుబాటు కల్పించడానికి దివ్యాంగులకు తక్కువ వడ్డీతో, ఈఎంఐ ద్వారా జాతీయ దివ్యాంగుల ఆర్ధిక అభివృద్ధి సంస్ధ(ఎన్ హెచ్ ఎఫ్ డి సి) జిల్లాలో 4గురికి రుణాలను మంజూరు చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు.  శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఎన్ హెచ్ ఎఫ్ డి సి జిల్లా  మేనేజర్ మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా   విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయసంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ రాకడ మణి ఆధ్వర్యంలో జాతీయ దివ్యాంగుల ఆర్ధిక అభివృద్ధి సంస్ధ ద్వారా మంజూరైన రూ. 19 లక్షల చెక్కులను నలుగురు దివ్యాంగులకు చెక్కును జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి చేతులమీదుగా చెక్కులను అందజేశారు.  ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ భారత ప్రభుత్వం జాతీయ దివ్యాంగుల ఆర్ధిక సహాయ సంస్ధ వారిచే ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్ధ ఏలూరు జిల్లా ద్వారా జిల్లాలోని నలుగురు దివ్యాంగులకు స్వయం ఉపాధిచే జీవనోపాధిని అభివృద్ధి చేసుకోనుటకు గాను ఒకోక్కరికి రూ. 4.75 లక్షల రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.  ఈ రుణాల కోసం 9 మంది ధరఖాస్తులు చేసుకోగా వీరిలో పరిశీలన అనంతరం 5 గురికి రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.  ఈ 5 గురిలో నలుగురికి చెక్కులు ఈ రోజు అందజేస్తున్నామని మిగిలిన ఒకరికి త్వరలో చెక్కును అందజేస్తామని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు తక్కువ వడ్డీతో 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు గల వారికి ఈ రుణాలను మంజూరు చేయడం జరిగుతుందని చెప్పారు.  దివ్యాంగులు ఈరుణాలను సద్వినియోగం చేసుకొని వారు చేసే వ్యాపారాలు మెరుగుపరచుకొని ఆర్ధికంగా ఎదగాలని ఆమె కోరారు.  కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎడి రాకడ మణి మాట్లాడుతూ దివ్యాంగులైన బేతు విజయవాణి, జుజ్జువరపు వెంకటేష్వరరావు, కంకిపాటి బాబూరావు మరియు కంకిపాటి చిరంజీవి వారలకు ఒకోక్కరికి రూ. 4.75 లక్షలు చొప్పున రూ. 19 లక్షల  లక్షల చెక్కులను జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అందించారని తెలిపారు.

About Author