డిప్యూటీ సీఎం కు స్వాగతం పలికిన డీఐజీ..ఎస్పీ..
1 min read
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలోని రైతు పొలంలో ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటచేసిన ఫారం పాండ్ నీటి కుంట నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రికి ఓర్వకల్లు విమానాశ్రయంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మరియు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలతో స్వాగతం పలికారు.ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను భద్రతను ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును అంతే కాకుండా ఎన్హెచ్ జాతీయ రహదారిపై ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జరగకుండా రేంజ్ డీఐజీ మరియు జిల్లా ఎస్పీ పరిశీలించారు.తర్వాత జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
