‘దిశ’ యాప్.. మహిళలకు రక్ష
1 min read– దిశా పోలీసుస్టేషన్ డిఎస్పీ వెంకట్రామయ్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు క్రైం: దిశయాప్… మహిళలకు రక్షణ.. భధ్రత అని దిశా పోలీసుస్టేషన్ డిఎస్పీ వెంకట్రామయ్య అన్నారు. ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప ఆదేశాల మేరకు.. బుధవారం నగరంలోని కె వి ఆర్ కళాశాల లో దిశా మహిళా పోలీసులు మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించడం , దిశా గస్తీ వాహనాల వల్ల మహిళల భద్రతకు భరోసా గురించి అవగాహన కల్పించారు. పాఠశాలలు, విద్యాసంస్థలు, కళాశాలల దగ్గర ఈవ్ టీజింగ్ , ఆకతాయిల వేధింపులు కట్టడికి దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మహిళలు రక్షణ పొందాలని తెలిపారు. కార్యక్రమంలో దిశా పోలీసుస్టేషన్ సిఐ ఓబులేషు , కె వి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా శాంతి , బయో కెమిస్ట్రీ ఉమెన్ ఎంపవర్ మెంట్ అధ్యాపకురాలు శ్రీమతి ధనా శ్రీ, మహిళా పోలీసులు , 550 మంది కెవి ఆర్ కళాశాల విద్యార్దినిలు పాల్గొన్నారు.