దిశ ఎన్ కౌంటర్ ఫేక్ !
1 min readపల్లెవెలుగువెబ్ : దిశ ఎన్‌కౌంటర్ కేసుపై సిర్పూర్‌కర్ కమిషన్ సంచలన నివేదికను ఇచ్చింది. దిశ కేసులో ఫేక్ ఎన్‌కౌంటర్ అని సిర్పూర్‌కర్ కమిషన్ తేల్చింది. 387 పేజీలతో సిర్పూర్‌కర్ కమిషన్ నివేదికను తయారు చేసింది. పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా విచారణ జరిగిందని కమిషన్ పేర్కొంది. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే ఎన్‌కౌంటర్ జరిగిందని సిర్పూర్‌కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది పోలీసులు పాల్గొన్నారని.. వీరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొంది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్‌లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్‌గౌడ్, జానకీరామ్, బాలురాథోడ్, శ్రీకాంత్ ఈ ఘటనకు పాల్పడ్డారని సిర్పూర్‌కర్ కమిషన్ వెల్లడించింది. అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశంతోనే కాల్పులు జరిపారన్నారు. వీరిపై ఐపీసీ 302, 201 ప్రకారం కేసు నమోదు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది.