PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డైరెక్ట‌ర్ ప్ర‌తాప్ పోత‌న్ క‌న్నుమూత‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రముఖ మలయాళ నటుడు, డైరెక్టర్ ప్రతాప్ పోతన్ (69) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. మలయాళ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేశారు. మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో ‘మరో చరిత్ర, ఆకలిరాజ్యం, డబ్బు డబ్బు డబ్బు, అమాయకుడు కాదు అసాధ్యుడు, కాంచనగంగ’ లాంటి మరెన్నో చిత్రాల్లో నటించారు. నాగార్జున నటించిన ‘చైతన్య’ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు డజనుకు పైగానే చిత్రాలకు దర్శకత్వం వహించారు.

                                      

About Author