పబ్లిక్‌గా ఏడ్చితే జాలి కాదు.. జుగ్బుప్స కలుగుతోంది
1 min read
పల్లెవెలుగు వెబ్: చంద్రబాబు నిన్న మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ‘ నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగాడిని నమ్మకూడదంటూ పూర్వీకులు చెప్పారని గతంలో నేను విన్నాను. కానీ, నవ్వే ఆడదాన్ని నేను ఇష్టపడతా. ఎందుకంటే ఆడది నవ్వితే అందంగా ఉంటుంది. కానీ ధైర్యం, తెగువ చూపించాల్సిన మగాడు పబ్లిక్‌లో ఏడ్చితే జాలి కాదు… జుగుప్స పుడుతుంది’ అంటూ రాంగోపాల్ వర్మ అన్నారు. ఈమేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.