నిరాశపరిచిన ఎల్ఐసీ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎల్ఐసీ పెట్టుబడిదారులను నిరాశపరిచింది. దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్ఐసీ ఐపీఓ షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. 8.62 శాతం డిస్కౌంట్తో రూ.867 దగ్గర లిస్ట్ అయిన ఎల్ఐసీ షేర్లు లక్షలాది మంది మదుపర్లకు నిరాశ మిగిల్చాయి. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో మునిగిపోయిన సమయంలో ఎల్ఐసీ లిస్ట్ కావడంతో ప్రతికూల ప్రభావం పడింది. సుమారు మూడు రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ అయిన తర్వాత ఎల్ఐసీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి.