వైయస్సార్ బీమా కింద తక్షణ సహాయం పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు అరుంధతీ నగర్ లో నివాసముంటున్న కొత్తపల్లి చౌడమ్మ అనారోగ్యంతో మృతి చెందింది, బాధిత కుటుంబానికి అండగా వైఎస్సార్ బీమా తక్షణ సహాయం కింద రూ 10 వేల రూపాయలు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్,ఎంపిడిఓ సురేష్ బాబు,గ సర్పంచ్ వెంకట సుబ్బయ్య,పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డిలు మంగళవారం అందజేశారు,ఈ సందర్భంగా ఎంపీపీ,ఎంపీడీఓ మాట్లాడుతూ వైఎస్సార్ బీమా చేసిన కుటుంబాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి సహజ మరణం చెందితే లక్ష రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు,అందులో భాగంగా తక్షణ ఆర్థిక సహాయంగా రూ 10 వేలు మృతురాలి కుటుంబ సభ్యులకు అంద చేయడం జరిగింది అన్నారు, మిగతా 90 వేల రూపాయల మొత్తాన్ని మృతురాలు యొక్క నామిని పేరుపైన ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సచివాలయ సంక్షేమ సహాయకులు చైతన్య, గ్రామస్తులు పాల్గొన్నారు.