రఘురామకృష్ణ రాజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ
1 min readపల్లెవెలుగు వెబ్: నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షల నిమిత్తం ఉన్న ఆయన.. సుప్రీం కోర్టు నుంచి బెయిల్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో ఆయనను ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. అరెస్టు అనంతరం ఆయన మీద సీఐడీ ఆధ్యర్యంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా దాడి చేశారని .. రఘురామకృష్ణ రాజు కోర్టుకు నివేదించారు. ఈనేపథ్యంలో ఆయనను ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షల నిమిత్తం తరలించారు.