మనభూమి -నా దేశం శిలాఫలకం ఆవిష్కరణ
1 min read– విద్యార్థి దశ నుంచే దేశం కోసం, భూమికోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యనభ్యసించాలి..
– ఎంపీడీవో గంజి రాజ్ మనోజ్ విజయవంతంగా మనభూమి -నా దేశం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆజాదికా అమృత మహోత్సవవ్ లో భాగంగా గురువారం పెదవేగి మండలం లో మన భూమి – నా దేశం శిలాఫలకాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ఆవిష్కరించారు, అమరవీరుల పేర్లను కూడా ఆ శిలాఫలకంపై పొందుపరిచారు. ఈ సందర్భంగా పెదవేగి ఎంపీడీవో రాజ్ మనోజ్ మాట్లాడుతూ ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క భారతీయుడు కూడా పాల్గొని దేశ సమైక్యత సౌబ్రాత్వన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థిని విద్యార్థులు విద్యనభ్యసిస్తూనే దేశం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను మరువకుండా, మన భూమిని సాటి మనిషిని ప్రేమించే తత్వం, పుడమి తల్లిని కాపాడుకునే అలవాటు అలవర్చుకొని ఎదగాలన్నారు. నేడు నాలుగు సచివాలయాలను. మూడు ప్రాథమిక పాఠశాలలను. రెండు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి మనభూమి – నా దేశం కార్యక్రమాలలో ఎంపీడీవో పాల్గొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు స్థానిక పౌరులు ప్రతిజ్ఞ చేశారు.